యన్టీఆర్ ‘శ్రీకృష్ణాంజ‌నేయ యుధ్ధం’కు 48 ఏళ్ళు

NTR Mythological Masterpiece Srikrishnanjaneya Yuddham Completes 48 Years.

నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు బాగా కలిసొచ్చిన దిగ్గజ దర్శకుల్లో సి.యస్.రావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలాంటి అలనాటి అపురూప చిత్రాల్లో ‘శ్రీకృష్ణాంజ‌నేయ యుధ్ధం’ ఒకటి. “అహంకారంతో బలరాముడు, అజ్ఞానంతో సత్యభామ, పదవీవ్యామోహంతో గరుత్మంతుడు పెంచుకున్న దర్పాన్ని అణచి, ఆంజనేయుని భక్తికి గల శక్తిని నిరూపించిన” సినిమా ఇది. ఇందులో యన్టీఆర్ శ్రీ‌కృష్ణుడిగా న‌టించ‌గా, రాజ‌నాల ఆంజ‌నేయుడిగా దర్శ‌న‌మిచ్చారు. య‌న్టీఆర్ సరసన దేవిక, వాణిశ్రీ కథానాయికలుగా నటించారు. యస్.వి.రంగారావు, కాంతారావు, రాజనాల, ఆర్జా జనార్ధన్‌రావు, రాజబాబు, నాగయ్య, ధూళిపాళ‌, మిక్కిలినేని, ముక్కామల, త్యాగరాజు, శాంతకుమారి, హేమలత, రోజారమణి, సంధ్యారాణి, వై.విజయ, బేబీ శ్రీ‌దేవి ముఖ్య భూమికలు పోషించారు. పూర్ణిమ పిక్చర్స్ పతాకంపై డి.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

డా.సి.నారాయణరెడ్డి, సముద్రాల జూనియర్, తాండ్ర సుబ్రహ్మణ్యం గీతరచనకు యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పన చేశారు. “నీవైన చెప్పవే ఓ మురళి”, “రామ ర‌ఘురామ”, “చక్కాని గోపాల కృష్ణుడమ్మ”, “రామలీల”, “గోపాల కృష్ణయ్య రావయ్య”.. ఇలా ప్రతీ పాట అజరామరంగా నిలిచింది. 1972 మే 18న విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘శ్రీకృష్ణాంజ‌నేయ యుధ్ధం’.. నేటితో 48 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here