
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 44


మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్

ఘనంగా కమిటీ కుర్రోళ్ళు 50 డేస్ సెలబ్రేషన్స్

మిథున్ చక్రవర్తికి మెగాస్టార్ అభినందనలు

NBK 109 లోశ్రద్దా శ్రీనాథ్

సత్యం సుందరం ట్రిమ్ చేశారు

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ వచ్చేసింది

మిథున్ చక్రవర్తికి 'దాదా సాహెబ్ ఫాల్కే'

దేవర హిందీ 3డేస్ కలెక్షన్స్

తండేల్.. ఫస్ట్ సింగిల్ అప్డేట్

దేవర 3 డేస్ కలెక్షన్స్

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం

మరోసారి మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న స్వాగ్
టాలీవుడ్ కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'స్వాగ్'. 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో శ్రీవిష్ణు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాలజిస్ట్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం రజినీకాంత్‌కు చికిత్స అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి

ఘనంగా కమిటీ కుర్రోళ్ళు 50 డేస్ సెలబ్రేషన్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

మిథున్ చక్రవర్తికి మెగాస్టార్ అభినందనలు
బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మిథున్ చక్రవర్తికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభినందనలు
బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

NBK 109 లోశ్రద్దా శ్రీనాథ్
బాలకృష్ణ ,వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కాంబినేషన్ లో NBK 109(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాలో బాలకృష్ణ కు జంటగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుంది.అలాగే ప్రముఖ హిందీ నటుడు బేబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

సత్యం సుందరం ట్రిమ్ చేశారు
కార్తి ,అరవింద స్వామి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మెయ్యళగన్.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ ఎక్సలెంట్ రివ్యూస్ తోపాటు టాక్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అయితే ఈసినిమా నిడివి విషయంలో కంప్లైన్ట్స్ వచ్చాయి.

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ
అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతూ వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. ఫిలింమేకర్స్‌లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుంది.

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సత్యం సుందరం' చిత్రం విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కార్తీ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆయనతో పాటు ఈ సినిమా దర్శకుడు '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ కూడా ఉన్నారు.

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టయన్-ది హంటర్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ సందడి ఈరోజు నుండి మొదలైయింది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈ సినిమానుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.ఇక వచ్చే నెలలో కూడా ఈసినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ లు రానున్నాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.వచ్చే నెలలో టీజర్ ను చివర్లో మరో సాంగ్ విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.సినిమాను ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కు బరిలోకి దించుతామని చెప్పారు.

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మిథున్ చక్రవర్తికి 'దాదా సాహెబ్ ఫాల్కే'
భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ఒకటి. ఈ అవార్డును పొందడం అనేది నటీనటులకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ వంటిది. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పురస్కారాన్ని పొందారు.

బలగం పాటకు ఐఫా అవార్డ్ గెలుచుకున్న మంగ్లీ
తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి తక్కువ సినిమాలలో 'బలగం' ఒకటి. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంత అనూహ్య విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడం వెనుక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కీలక పాత్ర పోషించారు.

దేవర హిందీ 3డేస్ కలెక్షన్స్
దేవర హిందీ కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ రాబట్టగా నిన్న ఏకంగా డబుల్ డిజిట్ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.మూడో రోజు నార్త్ లో 12.07కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో మూడు రోజుల్లో 29.52కోట్ల నెట్ ను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయినట్లే.మరి ఈరోజు అక్కడ ఎంత రాబట్టుకునేది ఆసక్తిగా మారింది.ఇక ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.పెద్దగా ప్రమోట్ చేయకున్న దేవర హిందీ లో సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రస్తుతం అక్కడ పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది.

తండేల్.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

దేవర 3 డేస్ కలెక్షన్స్
ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రెండు రోజులు ఊహించని రన్ తో కలెక్షన్ల వర్షం కురిపించగా మూడో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది. దాంతో మూడో రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 304 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇదే మొదటి 300కోట్ల సినిమా.ఇక నిన్న తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయ్.అయితే ఈ రోజు నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.ఈ రెండు రోజులు డీసెంట్ హోల్డ్ కొనసాగిస్తే చాలు ఆతరువాత గాంధీ జయంతి సెలువు కావడంతో మళ్ళీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా మారిన ఆయనకు తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ యొక్క మైనపు ప్రతిమ కూడా ఈ విగ్రహాంలో భాగం కావడం విశేషం.

మరోసారి మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్నారు. తనకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సాయి దుర్గ తేజ్. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప మనసుతో చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు.