యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ – చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తండేల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపించి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన సత్య మేకింగ్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది.
కాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్‌గా వుండబోతున్నాయి.
శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని స్ఫూర్తితో, టీమ్ సినిమా కోసం అద్భుతమైన, మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను చిత్రీకరీంచింది. మ్యాసీవ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో అద్భుతమైన శివరాత్రి సాంగ్‌ని గ్రాండ్‌గా స్కేల్‌లో షూట్ చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ ఒక టైమ్‌లెస్ క్లాసిక్ సాంగ్‌ని కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి, వేలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి అద్భుతంగా అలరించారు. ఈ శివరాత్రి పాట ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో నాగ చైతన్య కెరీర్‌లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా వుండబోతోంది. ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను మేకర్స్ విడుదల చేసారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ డ్యాన్సర్లతో పాటు డ్యాన్స్ చేస్తూ సంప్రదాయ దుస్తులలో కనిపించారు. పోస్టర్లు హై ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ స్కేల్‌ని ప్రజెంట్ చేశాయి. దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకున్నారు.
ఇక కథ రీత్యా శ్రీకాకుళం నేపథ్యం ఉండటంతో అక్కడి జాతర్లలో ఆడిపాడే పేరుమోసిన కళాకారులను రప్పించారు. అలాగే దాదాపు 900 మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక ఈ పాట కోసం శ్రీకాకుళం వాతావరణాన్ని తలపించేలా వేసిన భారీ సెట్, పాల్గొన్న కళాకారులు అన్నింటికీ కలిపి సుమారు 3 కోట్లు వరకు ఖర్చు అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న తండేల్ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























