దేవర హిందీ 3డేస్ కలెక్షన్స్  

devara 3days hindi collections

దేవర హిందీ కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ రాబట్టగా నిన్న ఏకంగా డబుల్ డిజిట్ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.మూడో రోజు నార్త్ లో 12.07కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో మూడు రోజుల్లో 29.52కోట్ల నెట్ ను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయినట్లే.మరి ఈరోజు అక్కడ ఎంత రాబట్టుకునేది ఆసక్తిగా మారింది.ఇక ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.పెద్దగా ప్రమోట్ చేయకున్న దేవర హిందీ లో సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రస్తుతం అక్కడ పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవరాల్ గా దేవరతో నార్త్ లో ఎన్టీఆర్ సాలిడ్ మార్కెట్ ఏర్పచుకోనున్నాడు.టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ కు అక్కడ హిందీ హీరోలతో సమానమైన మార్కెట్ ఉండగా పుష్పతో అల్లు అర్జున్ కు సాలిడ్ మార్కెట్ వచ్చింది.ఇక ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ ఆ జాబితాలో చేరిపోయాడు.నెక్స్ట్ ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా డైరెక్ట్ హిందీ సినిమానే.దాంతో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు మరింత చేరువకానున్నాడు.

ఇక అమెరికా పర్యటన ముగించుకొని ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు.త్వరలోనే వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.