ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రెండు రోజులు ఊహించని రన్ తో కలెక్షన్ల వర్షం కురిపించగా మూడో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది. దాంతో మూడో రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 304 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇదే మొదటి 300కోట్ల సినిమా.ఇక నిన్న తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయ్.అయితే ఈ రోజు నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.ఈ రెండు రోజులు డీసెంట్ హోల్డ్ కొనసాగిస్తే చాలు ఆతరువాత గాంధీ జయంతి సెలువు కావడంతో మళ్ళీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా నిన్నటి వరకు దేవర 80శాతం టార్గెట్ ను పూర్తి చేసింది.ఈవారంలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.నిన్నటి వరకు అక్కడ 7మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో మరో మిలియన్ మార్క్ చేరుకోనుంది. అటు నార్త్ అమెరికా లో ఇప్పటివరకు 5మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.
కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.అనిరుధ్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: