మిథున్ చక్రవర్తికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభినందనలు

Nandamuri Balakrishna and Pawan Kalyan Congratulates Mithun Chakraborty

బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇద్దరూ మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైనందుకు మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వీరితోపాటు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపింది.

పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో.. “హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

అలాగే హీరో బాలకృష్ణ.. “‘విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది. అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ‘డిస్కో కింగ్’. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను’’ అని బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.