కార్తి ,అరవింద స్వామి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మెయ్యళగన్.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ ఎక్సలెంట్ రివ్యూస్ తోపాటు టాక్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అయితే ఈసినిమా నిడివి విషయంలో కంప్లైన్ట్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కు చాలా దూరంలో మూడు గంటల నిడివి తో వచ్చింది ఈసినిమా.దాంతో చాలా మంది సినిమాగా బాగుంది కానీ మధ్యలో స్లో అనిపించింది అని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.ఇక ఈ కంప్లైన్ట్స్ నేపథ్యంలో మేకర్స్ ఏకంగా 18 నిమిషాలు కట్ చేశారు.ఈ ట్రిమ్ చేసిన వెర్షన్ ఈరోజు నుండి ప్లే అవుతుంది.సెకండ్ హాఫ్ లో కార్తి ,అరవింద స్వామి కూర్చుని చాలా సేపు మాట్లాడుకునే సీన్ వుంది దాన్ని కట్ చేశారు.
ఈసినిమా తెలుగులో సత్యం సుందరం గా ఈనెల 28న విడుదలవ్వగా ఇక్కడ కూడా డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.కాకపోతే దేవర ఉండడంతో ఆ పోటీని తట్టుకోలేక పోతుంది.సత్యం సుందరంలో శ్రీ దివ్య ,రాజ్ కిరణ్ ,కరుణాకరన్ కీలక పాత్రల్లో నటించగా గోవింద్ వసంత సంగీతం అందించాడు.2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక ,సూర్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























