తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి తక్కువ సినిమాలలో ‘బలగం’ ఒకటి. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంత అనూహ్య విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడం వెనుక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా సైతం పలు విభాగాల్లో 100కి పైగా అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవం 2024లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా నిలిచింది. బలగంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) అవార్డును గెలుచుకుంది.
ఇక సింగర్ మంగ్లీకి ఐఫా అవార్డు దక్కించుకున్న సందర్భంగా చిత్రనిర్మాణ సంస్థ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మరోసారి తమ చిత్ర గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలిపినందుకు ఆమెకు అభినందనలు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టింది.
పూర్తి గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, భాషను ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా చెప్పిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను కళ్లజూపింది.
కాగా ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించగా.. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా పరిచయమున్న వేణు ఎల్ధండి తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. అలాగే భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ పాటలు, మధు కెమెరా పనితనం కూడా బలగం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: