బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ నుంచి ఇప్పటికే స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిథున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా విషెస్ చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సీనియర్ నటుడికి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో.. “నా స్నేహితుడు మిథున్ దా మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉంది. బాగా అర్హమైనది. మిథున్ దా యొక్క అసాధారణమైన సినిమా ప్రయాణం భారతదేశం దాటి మిలియన్ల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. హృదయపూర్వక అభినందనలు!!! నా మిత్రమా నీకు మరింత శక్తి కలగాలి” అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: