గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ సందడి ఈరోజు నుండి మొదలైయింది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈ సినిమానుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.ఇక వచ్చే నెలలో కూడా ఈసినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ లు రానున్నాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.వచ్చే నెలలో టీజర్ ను చివర్లో మరో సాంగ్ విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.సినిమాను ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కు బరిలోకి దించుతామని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ నటించగా ఎస్ జె సూర్య,శ్రీకాంత్,శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా విజయం శంకర్ కు కీలకం కానుంది.రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 అంచనాలను అందుకోలేకపోయింది.దాంతో గేమ్ ఛేంజర్ తో హిట్ కొట్టి రేస్ లో నిలువాలని చూస్తున్నాడు.
ఇక మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం లుక్ మార్చే పనిలో వున్నాడు.ఈసినిమా కోసం చరణ్ బరువు పెరగనున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కించనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ నటించనుంది.కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: