టాలీవుడ్ కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘స్వాగ్’. ‘రాజ రాజ చోరా’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో శ్రీవిష్ణు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పటికే స్వాగ్ పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్, ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా స్వాగ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా అన్ని సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
కాగా స్వాగ్ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న స్వాగ్ అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: