బాలకృష్ణ ,వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కాంబినేషన్ లో NBK 109(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాలో బాలకృష్ణ కు జంటగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుంది.అలాగే ప్రముఖ హిందీ నటుడు బేబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్ లు ఏం రాలేదు.అప్పుడెప్పుడో గ్లింప్స్ రిలీజ్ చేశారు.అయితే త్వరలోనే మేజర్ అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.టైటిల్ తోపాటు టీజర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది.
మరోవైపు వరస విజయాలతో బాలకృష్ణ సూపర్ ఫామ్ లో వున్నాడు.గత ఏడాది వీర సింహా రెడ్డి ,భగవంత్ కేసరిలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. వీటికన్నా ముందు వచ్చిన అఖండ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు.మరి ఈ NBK 109 సినిమాతో విజయపరంపర కొనసాగిస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: