కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాలజిస్ట్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం రజినీకాంత్‌కు చికిత్స అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తలైవా ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి లత స్పందించారు. సూపర్‌స్టార్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె చెప్పారు. అయితే గతంలో కూడా పలుసార్లు రజినీ ఇలాగే అనారోగ్యంతో ఆస్పత్రుల్లో జాయినై, కోలుకుని మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరిన విషయం గుర్తుండేవుంటుంది. ఈ క్రమంలో రజినీ కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇక ఇదిలావుంటే, రజినీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయన్-ది హంటర్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ భాషల్లో విడుదల కానుంది. దీనితోపాటు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవా 171’గా తెరకెక్కుతోన్న ‘కూలి’ చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























