వరుణ్‌ తేజ్‌లో యంగ్ మెగాస్టార్‌ను చూశాను – శక్తి ప్రతాప్ సింగ్

Operation Valentine Director Shakti Pratap Singh Thanks Megastar Chiranjeevi

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించగా, మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారు ఈ వేడుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం గౌరవంగా వుంది. ఇది చాలా బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు నేనెప్పుడూ వరుణ్‌ తేజ్‌ను చూడలేదు. యువ వయసులో ఉన్న చిరంజీవి, నాగబాబును తనలో చూశాను. ఈ సినిమాకి తను మెయిన్ పిల్లర్. సినీ పిక్చర్స్ కి ధన్యవాలు. సమిష్టి కృషికి ఫలితం ఈ చిత్రం. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదలు. ఈ సినిమాలో యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా, అడ్వెంచర్‌, దేశభక్తి.. ఇలా చాలా అంశాలున్నాయి. ఈ సినిమాను తప్పకుండా అందరూ థియేటర్లలో చూడండి.. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =