శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. అదేంటంటే ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నారు. నిజానికి ఈసినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 11వ తేదీకి రిలీజ్ డేట్ ను మారుస్తూ అధికారికంగా ప్రకటించారు.
Update Alert ‼️
To ensure every film gets its moment in the spotlight 🌟 we’re announcing the 𝐍𝐞𝐰 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 for #GeetanjaliMalliVachindhi as 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟏𝐭𝐡#GMVOnApril11#Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju pic.twitter.com/koR5yFsvTU
— Kona Film Corporation (@KonaFilmCorp) February 27, 2024
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























