కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 122

kamal haasan indian 2 movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఇండియన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్- ఫస్ట్ సింగిల్ అప్ డేట్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
NTR and Prashanth Neel Combo Movie Shoot Begins From August 2024
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే?

'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోమవారం 41వ జన్మదినం జరుపుకుంటున్నారు. కాగా ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తన 30వ చిత్రంగా 'దేవర' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్ తదుపరి సినిమాలకు సంబంధించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
kalki 2898 ad team revealed about prabhas bujji
సినిమా వార్తలు

కల్కి 2898 ఏడీ- ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ బుజ్జి

బాహుబ‌లి, స‌లార్ వంటి సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మే 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అది కాస్తా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఫైనల్ గా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
gam gam ganesha telugu movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతేకాదు ఆనంద్ నటనకు కూడా ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. మే 31వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకి రానుంది.

TFN Adminవాట్సాప్
Veteran Actor Sathyaraj to Star in Narendra Modi Biopic
సినిమా వార్తలు

ప్రధాని బయోపిక్‌.. నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయంగా తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తనదైన పాలనా దక్షతతో దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్నారు. ప్రధానమంత్రికి మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సమర్ధుడైన నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగిన దేశాధినేతలలో ప్రధాని మోదీ మొదటిస్థానంలో ఉన్నారు. ఇక ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు అధికారం దక్కించుకోగా, ఈసారి కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Remove term devara movie first single fear song out devara movie first single fear song out
సాంగ్

దేవర- గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా ఈసినిమా రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
time set for the release of Fear Song
సాంగ్

దేవర ఫియర్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుండి ఫస్ట్ సాంగ్ ఫియర్ రేపు విడుదలకానుందని తెలిసిందే.నిన్న రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈప్రోమో ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది.రేపటి నుండి ఈ సాంగ్ యూట్యూబ్ ను రూల్ చేస్తూ వ్యూస్ పరంగా ఈ సాంగ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈసాంగ్ రేపు రాత్రి 7:02 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ మ్యూజిక్ అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
Double ISMART teaser gets a SENSATIONAL response
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

రామ్ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్.రామ్ బర్త్ డే సందర్భంగా మూడు రోజుల క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తెలుగు తోపాటు ఇతర భాషల్లో రిలీజైన ఈ టీజర్ 100మిలియన్ల కుపైగా డిజిటల్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు వెర్షన్ అయితే యూట్యూబ్ లో 10మిలియన్లకు పైగా వ్యూస్ తో రెండో స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఫస్ట్ పార్ట్ కుమించి ఈ సీక్వెల్ వుండనుందని టీజర్ తో హింట్ ఇచ్చారు.రామ్ ఎనర్జీ , డైలాగ్స్ వీటికి తోడు మణిశర్మ మ్యూజిక్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా టీజర్ తో హైప్ డబుల్ చేయడం లో టీం సక్సెస్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Prasanna Vadanam digital premieres May 24th on aha
సినిమా వార్తలు

ఆహాలోకి ప్రసన్నవదనం

హీరోగా వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న నటుడు సుహాస్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ప్రసన్నవదనం.ఈఏడాది ఇది తనకు మూడో రిలీజ్.ఈసినిమాకు ముందు సోలో హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ అనిపించుకుంది.ఈనెల స్టార్టింగ్ లో థియేటర్లలోకి వచ్చిన ప్రసన్న వదనం కూడా పాజిటివ్ రివ్యూస్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఆహా ఈసినిమా ను ఈనెల 24నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఆహా గోల్డ్ వున్న వారు 24గంటల ముందే చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
star heroes hungama in 2024 second half
సినిమా వార్తలు

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర

ప్రతి ఏడూ ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సీజన్లలో మాత్రం సినిమాల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ. ఈపండుగకు పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతుంటాయి.. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చిలో ఫ్లో కాస్త తగ్గినా సమ్మర్ కు మాత్రం మళ్లీ జోరు పెరుగుతుంది. ఇలా సీజన్ ను బట్టి సినిమాల రిలీజ్ కు ఉంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి బాగానే రిలీజ్ అయినా.. సమ్మర్ సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. వెరసి ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండాఫ్ గురించి. ఇక…

TFN Adminవాట్సాప్
vijay sethupathi new movie titled as ace
సినిమా వార్తలు

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో మక్కల్ సెల్వన్

విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే పాత్రలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి కాబట్టే విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగుతో పాటు పలు భాషల్లో పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆరుముగకుమార్‌ అనే దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
TFI Directors Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ డే మే 19న జ‌రుగనున్న విషయం తెలిసిందే. ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక‌ కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, నాగచైతన్య సహా అగ్ర హీరోలు అందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు శనివారం టీఎఫ్‌డీఏ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Srikanth Mవాట్సాప్
Tollywood Best Political Dramas
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్

వినోద ప్రధానంగా సాగే చలనచిత్ర రంగంలో ఎక్కువగా ప్రేమ కథలు అలాగే కుటుంబ కథా చిత్రాలు రూపొందుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇవి ప్రేక్షకులను అలరించడంతోపాటు ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. సామాజిక సమస్యలను ఎత్తిచూపడంలో, అలాగే వాటికి సరైన పరిష్కారాలను చూపడంలో ఇలాంటి తరహా చిత్రాలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులందరి కోసం తెలుగులో రాజకీయ కథాంశాలతో వచ్చిన బెస్ట్ తెలుగు చిత్రాలను ఒకసారి పరికిద్దాం.

Srikanth Mవాట్సాప్
kajal aggarwal on board for manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

కన్ఫామ్ కన్నప్పలో కాజల్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు.ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి మంచు విష్ణు ఎప్పటికప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నాడు. ప్రతి అప్ డేట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మే20వ తేదీన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా ఈటీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
pooja hegde confirmed as heroine in suriyas 44th movie
సినిమా వార్తలు

సూర్యతో బుట్టబొమ్మ భలే ఛాన్స్

ముకుంద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మొదట వరుస ఫ్లాప్స్ అందుకున్నా ఆ తరువాత మాత్రం సూపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. వరుసగా స్టార్ హీరోలతో తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయింది. గత రెండేళ్ల క్రితం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంది.

TFN Adminవాట్సాప్
Manam Movie 10th Anniversary Celebrations
సినిమా వార్తలు

మనం సినిమాకు 10 ఏళ్ళు.. స్పెషల్ రిలీజ్

టాలీవుడ్‌కు రెండు కళ్ళు అనదగ్గవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఈ ఇద్దరు అగ్ర హీరోలు అన్ని రకాల పాత్రలు పోషించినప్పటికీ ఎన్టీఆర్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోగా, ఏఎన్నార్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. వీరిలో ఎన్టీఆర్ 1995లోనే తనువు చలించగా, ఏఎన్నార్ 2014లో పరమపదించారు. తుదిశ్వాస విడిచేవరకూ ఏఎన్నార్ సినిమాలలో నటించడం విశేషం. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి చిత్రం 'మనం'. ఈ సినిమా ఆయనకే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం.

Srikanth Mవాట్సాప్
Love Me Director Arun Bhimavarapu Says Thanks to Dil Raju
సినిమా వార్తలు

యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి - అరుణ్ భీమవరపు

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
jr ntr devara movie first single sample
సినిమా వార్తలు

దేవర ఫస్ట్ సింగిల్ శాంపిల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Hero Ashish Shows Full Confidence on Love Me Hit
సినిమా వార్తలు

లవ్ మీ తో సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి - ఆశిష్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
bhaje vaayu vegam movie overseas release update
సినిమా వార్తలు

భజే వాయు వేగం ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా భజే వాయి వేగం. నాన్న కోసం కొడుకు ఏంచేశాడు అనే నేపథ్యంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది. ఇక ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ సెట్ అయ్యిందే సాంగ్ ను రిలీజ్ చేయగా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్