విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతేకాదు ఆనంద్ నటనకు కూడా ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. మే 31వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మే 20వ తేదీన సాయంత్రం 4గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
A clear peek into the world of confusion!
Trailer drops on 20 May @ 4 pm#GGG#GamGamGanesha on May 31@ananddeverkonda @UrsNayan @officialpragati @udaybommisetty @chaitanmusic #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth pic.twitter.com/cuS2EdhdgJ— Hylife Entertainments (@HylifeE) May 18, 2024
కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: