ప్రధాని బయోపిక్‌.. నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప

Veteran Actor Sathyaraj to Star in Narendra Modi Biopic

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయంగా తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తనదైన పాలనా దక్షతతో దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్నారు. ప్రధానమంత్రికి మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సమర్ధుడైన నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగిన దేశాధినేతలలో ప్రధాని మోదీ మొదటిస్థానంలో ఉన్నారు. ఇక ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు అధికారం దక్కించుకోగా, ఈసారి కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ తరుణంలో ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ సినిమా రూపొందనుంది. మోదీ బయోపిక్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పాత్రను ఒక ప్రముఖ నటుడు పోషించనున్నట్లు తెలిసింది. ఆయన మరెవరో కాదు, ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల్లో కట్టప్పగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్. అవును సత్యరాజ్ ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, నరేంద్ర మోదీపై రూపొందనున్న ఈ బయోపిక్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంపై 2019లో ఆల్రెడీ ఓ చిత్రం వచ్చింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో రూపొందిన ఈ బాలీవుడ్‍ మూవీకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించగా.. స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించారు. అలాగే మనోజ్ జోషి, శీలా గోరె, అక్షత్ ఆర్ సలుజా, నవనీద్ గైరోలా, బొమ్మన్ ఇరానీ, బర్కా సెంగుప్త తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజెండ్ గ్లోబల్ స్టూడియోస్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ మూవీకి శశి – ఖుషి, హృతేశ్ మోదక్ సంగీతం అందించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సత్యరాజ్ మరోసారి ప్రధాని మోదీ పాత్రలో కొత్త సినిమా రూపొందుతుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.