
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 28


కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని

సలార్ ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్స్ అప్ డేట్

అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ఆదికేశవ ట్రైలర్

అశ్విన్ బాబు కొత్త సినిమా ప్రారంభం

యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గూఢచారి2 హీరోయిన్ ఫిక్స్

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్


సెన్సార్ పూర్తిచేసుకున్న కోట బొమ్మాళి పీఎస్

గోవా లో గోపీచంద్ 32 కీలక సన్నివేశాల షూట్

సలార్ మేకర్స్ సీరియస్ వార్నింగ్

బ్రీత్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. బ్రీత్ అనే టైటిల్ తో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని
ఈఏడాది సమ్మర్ లో దసరాతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాని చివర్లో హాయ్ నాన్నతో వస్తున్నాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రొమాంటిక్ & ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది. సాంగ్స్,ట్రైలర్ సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి.ప్రస్తుతం నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా వున్నాడు.అయితే ఈసినిమాను రెగ్యులర్ ప్రమోషన్స్ తో కాకుండా డిఫ్రెంట్ ఐడియాస్ తో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు.

సలార్ ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్స్ అప్ డేట్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

8రోజుల్లో టైగర్ 3 ఎంత రాబట్టిందో చెప్పేశారు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 కలెక్షన్ల వివరాలను అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ.ఈసినిమా ఎనిమిది రోజుల్లో దేశ వ్యాప్తంగా 280 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఇందులో నెట్ 230.75కోట్లు. అలాగే ఓవర్సీస్ లో 96కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 376కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 10.25కోట్ల వసూళ్లను రాబట్టింది.

అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ఆదికేశవ ట్రైలర్
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ ను కొట్టాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది

అశ్విన్ బాబు కొత్త సినిమా ప్రారంభం
నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఈసిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్ల్, పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నవంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా…

గుంటూరు కారం- మహేష్ గారు ప్రోపర్ బ్లాస్ట్ తో వస్తున్నారు
సూపర్ స్టార్ మహష్ బాబు నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఈసినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించినవి విధంగా మాస్ లుక్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గానేే ఈసినిమా నుండి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయగా ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

గూఢచారి2 హీరోయిన్ ఫిక్స్
టాలీవుడ్ టాలెండ్ హీరో అడివి శేష్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథలను ఎంచకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అందుకే ఇప్పటివరకూ పరాజయం అనేదే లేకుండా వరుస హిట్లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అడివి శేష్ లిస్ట్ లో ఉన్న సినిమా గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఫైనల్లీ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

యానిమల్ అర్జన్ వైలీ పాట రిలీజ్
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ తో వచ్చేస్తున్నాడు. రణ్ బీర్ తో యానిమల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 1వతేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్
ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

థియేటర్‌లో కత్రినాతో సల్మాన్ ఖాన్ డ్యాన్స్... వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టైగర్ 3'. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కామియో రోల్ లో కనిపించడం విశేషం. ఇక 'టైగర్' ప్రాంఛైజీలో భాగంగా ఇంతకుముందు వచ్చిన 'ఏక్తా టైగర్' మరియు 'టైగర్ జిందా హై' తర్వాత వచ్చిన సినిమా కావడంతో తొలినుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన…

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కోట బొమ్మాళి పీఎస్ లో ఆ సీన్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది - వరలక్ష్మీ శరత్ కుమార్
తమిళంలో ఇంతకుముందు చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారని, ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, కీలకపాత్ర పోషించారు. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు…

సెన్సార్ పూర్తిచేసుకున్న కోట బొమ్మాళి పీఎస్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. నవంబర్ 24వ తేదీన ఈసినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అంతేకాదు ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీకు సిద్దమైపోయింది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

గోవా లో గోపీచంద్ 32 కీలక సన్నివేశాల షూట్
శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాన ఇటీవలే లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతానికి గోపీచంద్ 32 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నట్టు ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నట్టు తెలిపాడు.

అదుర్స్ రీ రిలీజ్.. థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి
రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' శనివారం (నవంబర్ 18, 2023) రీ రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

సలార్ మేకర్స్ సీరియస్ వార్నింగ్
పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మరోసారి సలార్ టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.