ఫైనల్లీ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

thalapathy vijays leo movie ott release date fixed

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈసినిమాను ఇండియా వైడ్ గా నవంబర్ 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 28వ తేదీన గ్లోబల్ వైడ్ గా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇంకా హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =