మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ ను కొట్టాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. కామెడీ యాంగిల్, శ్రీలీల-వైష్ణవ్ కెమిస్ట్రీ, ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ మాస్ యాంగిల్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: