కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 26

Ranbir Kapoor Expresses His Interest to Work in Prabhas' Spirit Movie
సినిమా వార్తలు

ప్రభాస్ స్పిరిట్‌ లో నటించడంపై.. రణ్‌బీర్‌ కపూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్‌'. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలై ట్రైలర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. నేషనల్‌ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే 'కబీర్‌ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి…

Srikanth Mవాట్సాప్
hanuman movie sound mixing work begun
సినిమా వార్తలు

హనుమాన్ సౌండ్ మిక్సింగ్ పనులు ప్రారంభం

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
vikrams dhruva nakshathram movie postponed again
సినిమా వార్తలు

ధ్రువ నక్షత్రం- మరోసారి రిలీజ్ వాయిదా

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ధ్రువ నక్షత్రం. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్‌ లో నటిస్తున్నాడు విక్రమ్.

TFN Adminవాట్సాప్
bhagavanth kesari movie streaming on amazon prime video
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్‌ 19న విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఈసినిమాతో అనిల్ రావిపూడి లిస్ట్ ల ఖాతాలో మరో సినిమా చేరిపోవడమే కాకుండా బాలకృష్ణకు హ్యాట్రిక్ ఇచ్చింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్‌ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను అందించింది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
prabhas praises on animal movie trailer
ట్రైలర్ & టీజర్

యానిమల్ ట్రైలర్ పై ప్రభాస్ రియాక్షన్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇక ఈసినిమా ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు…

TFN Adminవాట్సాప్
Rajinikanth and Kamal Haasan Meets While Shoot Their Films in Same Studio After 21 Years
సినిమా వార్తలు

ఒకే ఫ్రేమ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్.. ఫొటోస్ వైరల్, ఖుషీ అవుతోన్న ఫ్యాన్స్

కోలీవుడ్ టాప్ హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇరువురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈ స్టార్‌ హీరోలు ఇద్దరూ 2 దశాబ్దాల తర్వాత చెన్నైలోని ఒకే స్టూడియోలో తమ కొత్త సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో కమల్ హాసన్, రజనీకాంత్ ఆప్యాయంగా పలకరించుకుంటూ, నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఫోటోలను పంచుకుంది.

Srikanth Mవాట్సాప్
game changer new schedule starts in mysore
షూటింగ్ అప్‌డేట్

మైసూర్ లో మొదలైన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
suriya gets injured on the sets of kanguva movie
సినిమా వార్తలు

కంగువ షూట్ లో గాయపడిన సూర్య

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చెన్నైలో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సూర్య గాయపడినట్టు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో సూర్య భుజం మీద కెమెరా పడినట్టు తెలుస్తోంది. దీంతో సూర్య భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి…

TFN Adminవాట్సాప్
India vs Australia 2nd T20 Match Keerthy Suresh Launched Online Ticket Sales at Thiruvananthapuram
సినిమా వార్తలు

కీర్తి సురేష్ చేతులమీదుగా.. టీ20 మ్యాచ్ ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభం

కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు నేషనల్ అవార్డు విన్నర్ నటి కీర్తి సురేష్. ఈ మేరకు ఆమె కేరళలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ సమక్షంలో కీర్తి సురేష్ ఈ సేల్‌ను ప్రారంభించారు. కాగా నవంబర్ 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
megastar chiranjeevi 156 movie regular shooting begins
షూటింగ్ అప్‌డేట్

మెగా 156 షూటింగ్ షురూ

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. అంతేకాదు మ్యూజిక్ సెషన్స్ కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
animal movie trailer out now
ట్రైలర్ & టీజర్

అదిరిపోయిన యానిమల్ ట్రైలర్

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ముందు కాంబినేషన్ కే ఈసినిమాకు క్రేజ్ పెరగగా ఆ తరువాత టైటిల్ దగ్గర నుండి రిలీజ్ అయి ప్రతి అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెంచాడు తప్పా ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు సందీప్ వంగా. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే టీజర్ ను బట్టి అర్థమైపోయింది. ఈసినిమాలో రణబీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ తరహాలో ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
kapildev wraps up his dubbing for Lal Salaam movie
షూటింగ్ అప్‌డేట్

లాల్ సలామ్- లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ డబ్బింగ్ కంప్లీట్

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూర్తిచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో కపిల్ దేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు కపిల్ దేవ్. ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
chiranjeevi launched bubble Gum movie izzat song
సాంగ్

బబుల్ గమ్- చిరు రిలీజ్ చేసిన ఇజ్జత్ సాంగ్

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya's Dhootha Official Trailer Released
ట్రైలర్ & టీజర్

దూత ట్రైలర్ రిలీజ్.. జర్నలిస్టుగా అదరగొట్టిన నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'దూత'. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టబోతున్నారు. 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ దూత వెబ్ సిరీస్.. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా ఈ 'దూత' వెబ్ సిరీస్ డిసెంబర్ 1న…

Srikanth Mవాట్సాప్
Devil Second Single Glimpse Release Date
ట్రైలర్ & టీజర్

డెవిల్ సెకండ్ సింగిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాను ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ డేట్…

TFN Adminవాట్సాప్
animal movie censor reportv
సినిమా వార్తలు

యానిమల్ సెన్సార్ రిపోర్ట్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu Birthday First Look Poster Released From Kannappa
ఫస్ట్ లుక్

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Reveals Interesting Facts About Thandel Movie
సినిమా వార్తలు

తండేల్ నా కెరీర్‌లో సెన్సేషనల్ మూవీ అవుతుంది - నాగచైతన్య

తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ కొడుకు అక్కినేని నాగచైతన్య. అక్కినేని వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని, క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ సృష్టించారు నాగ‌చైత‌న్య. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు. యాక్షన్ సినిమాలూ చేశారు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ఎప్పుడూ పెద్ద పీట వేసే చైతూ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆయ‌న ప్రధాన పాత్ర పోషించిన 'దూత' డిసెంబర్1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
This week's releases in Telugu
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

ఈశుక్రవారం బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు సందడి చేయనున్నాయి.అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి డబ్బింగ్ సినిమా.ఈసినిమాల విషయానికి వస్తే ఆదికేశవ ,కోట బొమ్మాళి పీఎస్ తోపాటు ధ్రువ నక్షత్రం కూడా విడుదలవుతుంది.

Mahender Reddyవాట్సాప్
tiger 3 movie ten days collections
బాక్సాఫీస్

400కోట్ల క్లబ్ లో టైగర్ 3

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 నిన్నటి తో 400కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 7కోట్ల నెట్ ను వసూళ్లను సాధించింది.వరల్డ్ కప్ ఈసినిమా కలెక్షన్స్ ను ప్రభావం చేసింది అయితే ఇప్పుడు మాత్రం స్టడీగా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం 10రోజుల్లో దేశ వ్యాప్తంగా 298కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో నెట్ 244.80కోట్లు.ఇక ఓవర్సీస్ లో ఈసినిమా 102.50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా 10రోజుల్లో 400.50కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్