ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. వాటిలో బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవిసింహా, లెజెండ్ ఇంకా అఖండ సినిమాలు. ఈ మూడు సినిమాలు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమయ్యారు వీరిద్దరూ. ఆ సినిమా మరేదో కాదు అఖండ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ కూడా ఈసినిమా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ కూడ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసీక్వెల్ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బాలకృష్ణ పుట్టినరోజు నాడు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈసీక్వెల్ లో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తుంది. అఖండ సినిమాను నిర్మించిన మేకర్సే ఈసీక్వెల్ ను కూడా నిర్మించనున్నట్టు సమాచారం. మరి వీటన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
2021 డిసెంబర్ లో అఖండ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఈసినిమా కూడా ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: