యూ ఎస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దసరా

Nani's Dasara Movie USA Box Office Collections

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలోసాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో హీరో నాని, కీర్తి సురేష్ లతో పాటు మిగిలిన లీడింగ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. నాని – కీర్తి సురేష్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ గా ఉంది. డీ గ్లామర్ లుక్ లో కూడా కీర్తి సురేష్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా అద్భుత రెస్పాన్స్ ను అందుకుంటుంది. యూ ఎస్ లో ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా రిలీజ్ అయిన దసరా మూవీ ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది.తాజాగా 800K ప్లస్ డాలర్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ వన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది. యూ ఎస్ లో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా దసరా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =