రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే

ramabanam brotherhood video released

మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఇది మూడో సినిమా. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఇప్పటికే పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఓ డైలాగ్ తో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. బ్రదర్ హుడ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో ఆ రాముడుకి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరినీ కలిపితే నేను అంటూ వచ్చే డైలాగ్ ఆట్టుకుంటోంది. దీన్ని బట్టి జగపతి బాబుకు అన్ని విషయాల్లో గోపీచంద్ ఎలా అండగా నిలుస్తాడో ఈసినిమా ద్వారా చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. వీడియో అయితే ఆకట్టుకుంటంది. అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి చూపింతబోతున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలోడింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =