విశ్వక్ సేన్ 11వ సినిమా అధికారిక ప్రకటన

Vishwak Sen 11th Movie Announced

డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక విశ్వక్ సేన్ ఖాతాలో మరో సినిమా ఉన్న సంగతి తెలిసిందే కదా. విద్యాధర్‌ దర్శకత్వంలో అడ్వెంచరస్‌ ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు విశ్వక్ సేన్. ఈ రోజు విశ్వక్ బర్త్‌డే సందర్భంగా తన నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌, ఇతర నటీనటులతో పాటు సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 2 =