ఎన్టీఆర్ 30 అప్డేట్ 

NTR30 Latest Update
గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో వచ్చి భారీ హిట్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈసినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన 30వ సినిమా ను కొరటాల శివతో చేస్తున్నాడని తెలిసిందే. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈచిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈసినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా రేపటి నుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఈసినిమా కోసం భారీ సెట్ వేశారు. రేపు నైట్ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. 
 
ఇక ఈచిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ అలాగే ఆక్వామెన్ , జస్టీస్  లీగ్ , బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించిన బ్రాడ్ మిన్నిచ్, ఎన్టీఆర్ 30కి పనిచేయనున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కనుంది. 
 
పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, హీరోయిన్ గా నటించనుంది. తెలుగులో జాన్వీ కి ఇదే మొదటి సినిమా. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ,కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి  కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఎలాగైనా ఈసినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని కొరటాల శివ భావిస్తున్నాడు . 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.