వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్

venkatesh saindhav movie release date fixed

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానాతో కలిసి రానా నాయుడు అనే సినిమాతో అలరించాడు. మరోవైపు వెంకీ సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే ఈసినిమా ఫుల్ యాక్షన్ తో ఉంటుందన్న విషయం అర్థమయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. క్రిస్మస్ కానుకగా 22 డిసెంబర్ 2023న సైంధ‌వ్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈసందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఓ కంటైనర్ పై, తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో వెంకీని శైలేష్ కొలను మునుపెన్నడూ లేని పాత్రలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 5 =