దసరా కోసంమార్నింగ్ షోస్, ఎక్ట్స్రా షోస్

morning shows and special shows for dasara movie

ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దసరా ఒకటి. ఈసినిమాకోసం కేవలం నాని అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సారి నాని అంత ఊర మాస్ రోల్ లో కనిపిస్తుండటం.. డిఫరెంట్ కథ, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తిని పెంచింది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసుకోవడం.. ఇంకా మంచి క్రేజ్ రావడంతో అదనపు షోలను యాడ్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే మార్నింగ్ షోలను, ఎక్ట్స్రా షోస్ ను యాడ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు శ్రీకాంత్. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seventeen =