పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రిలీజ్..

Ponniyin Selvan 2 Trailer Released

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్, పొన్నియిన్ సెల్వన్ ను  రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అన్ని భాషల్లో కలిపి  500కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సెకండ్  పార్ట్ విడుదలకు సిద్దమతుంది. అందులో  భాగంగా ఈ రోజు ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నై లో జరిగింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.  ఈఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

3 నిమిషాల 31 సెకండ్ల నిడివిగల ఈట్రైలర్, సినిమాపై అంచనాలను పెంచింది.  విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే సెకండ్ పార్ట్ కూడా బాక్సాఫీస్  వద్ద  వసూళ్ల  సునామిని సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే మొదటి భాగం కంటే రెండో భాగం రన్ టైం ఎక్కువగా వుండనుందని సమాచారం. మొదటి భాగంలో  కథ ను పెద్దగా రివీల్ చేయలేదు. కథంతా రెండో భాగంలోనే వుంటుందట దాంతో నిడివి కొంచెం ఎక్కువగా వుండనుందట.

భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. విక్రమ్ , కార్తీ , జయం రవి , త్రిష , ఐశ్వర్యా రాయ్ , శోభిత దూళిపాళ్ల , ప్రకాష్ రాజ్ , ప్రభు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఏప్రిల్ 28న ఈ సినిమా తెలుగు , తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 15 =