మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రావణాసుర సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కాకుండా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను కూడా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1970 కాలంలో ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. అప్పట్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: