దసరా రివ్యూ : సూపర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా

Dasara Telugu Movie Review

న్యాచురల్ స్టార్ నాని,కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ దసరా. మచ్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా క్రేజ్ తెచ్చుకున్న ఈచిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : నాని , కీర్తి సురేష్ ,దీక్షిత్ శెట్టి , సాయి కుమార్ , షైన్ టామ్ చాకో
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
సినిమాటోగ్రఫీ : సత్యాన్ సూర్యన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : చెరుకూరి సుధాకర్

కథ :

బొగ్గు గనుల నేపథ్యంలో 1995లో గోదావరిఖని లోని వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ప్రధానంగా స్నేహం , ప్రేమ ,పగ ఈమూడింటీ చుట్టూ కథ తిరుగుతుంది. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్ ) ,సూరి (దీక్షిత్ శెట్టి) ముగ్గురూ ఫ్రెండ్స్. ఈక్రమంలో ధరణి , వెన్నలను ప్రేమిస్తాడు కానీ సూరి కూడా వెన్నెల ను ఇష్టపడుతాడు దాంతో సూరి కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఇక ఊర్లో వున్న సర్పంచ్ ,నంబి (షైన్ టామ్ చాకో ) వల్ల ఈ ముగ్గురి జీవితాల్లో సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ ధరణి, ప్రేమ ఏమైంది ? వెన్నెల ,ధరణి ఒక్కటయ్యారా ? సర్పంచ్ వల్ల ధరణి ,వెన్నెల, సూరి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? చివరకు ధరణి ,సర్పంచ్ ఫై ఎలా పగ తీర్చుకున్నాడనేది మిగితా కథ.

విశ్లేషణ :

కథలో చెప్పుకున్నట్లు ఇది రివేంజ్ డ్రామా. అయితే దాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నా ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు. ఇక ఇంటర్వెల్ బ్లాక్, వావ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఎక్సయిట్ తో బయటికి వచ్చే ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ ఫై అంచనాలు పెరిగిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ కూడా సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమ్యాక్స్ ఫైట్ అదిరిపోయింది. సినిమా ఫై ఏ అంచనాలను పెట్టుకొని వెళ్తామో, వాటిని అందుకుంటుంది. విలేజ్ సెట్అప్ కూడా బాగుంది. మొదటి సినిమాతోనే ఇలాంటి అవుట్ ఫుట్ ను ఇచ్చినందుకు శ్రీకాంత్ కు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంటర్వెల్ , క్లెమ్యాక్స్ ను డీల్ చేసిన విధానం అద్భుతం. సర్పంచ్ క్యారెక్టర్ ను ఎంటర్ చేసిన విధానం కూడా బాగుంది.

ఇక సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. దానికి తోడు తెలంగాణ యాస లో నాని చెప్పడంతో బాగా పేలాయి. కెమెరా , మ్యూజిక్ , ఎడిటింగ్ ఇలా  ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మంచి అవుట్ ఫుట్ ఇవ్వడంతో దసరా బ్లాక్ బాస్టర్ కావడం ఖాయమనే చెప్పొచ్చు.

పెరఫార్మన్స్ :

నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ రోల్ ఇచ్చినా ఆ రోల్ కి వంద శాతం న్యాయం చేయగలడు. అయితే ఈసినిమాలో అంతకుమించి అనేలా నటించి ఆశ్చర్యపరిచాడు. ఊర మాస్ గెటప్ లో స్క్రీన్ ఫై రచ్చ చేసాడు. తెలంగాణ యాస కూడా నానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ముఖ్యంగా కళ్లతో ఎమోషన్స్ ను పలికించిన విధానం చాలా బాగుంది. ధరణి పాత్ర,నాని కెరీర్ లోనే బెస్ట్ రోల్ గా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

ఇక వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ కూడా చాలా బాగా నటించింది. డీగ్లామర్ రోల్ లో కనిపించడమే కాదు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. నాని , కీర్తి సురేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షుకులను ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి తరువాత సినిమాలో సూరి పాత్ర హెలైట్ అయ్యింది. ఆ పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి బాగా చేశాడు. తన పాత్ర కూడా చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మంచి పెరఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే మిగితా కీలక పాత్రల్లో నటించిన , సాయి కుమార్ , సముధ్రఖని , జారినా వాహబ్, పూర్ణ వారి రోల్స్ కి న్యాయం చేశారు. ఓవరాల్ గా క్యాస్టింగ్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లింది.

సాంకేతిక విభాగం :

మొదటి సినిమాతోనే మంచి అవుట్ ఫుట్ ను రాబట్టుకొని సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడు. కథ దగ్గర్నుండి నటీనటులు , టెక్నీషియన్స్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమాను మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ,క్లైమ్యాక్స్ ను డీల్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో సంతోష్ నారాయణ్ సంగీతం మరో హైలైట్. సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోశాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సినిమాకి ప్లస్. లో లైట్ లో కూడా అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడ రాజీ పడకుండా సినిమాను మంచి క్యాలిటీ తో నిర్మించాడు.

తీర్పు :

ఓవరాల్ గా భారీ అంచనాలతో  వచ్చిన దసరా ఆ అంచనాలను అందుకొని నానికి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన   ఈ చిత్రంలో నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ బ్లాక్ , క్లైమ్యాక్స్ ,సంగీతం హైలైట్స్ అయ్యాయి. కేవలం మాస్ , యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వుంది ఈదసరా.

దసరా ట్రైలర్:

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =