టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామంలో జరిగే ఫన్నీ, సీరియస్ ఎలిమెంట్స్ తో పాటుగా సస్పెన్స్ ను కూడా గ్లింప్స్ లో చూడచ్చు. గ్లింప్స్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The game changer, the mind behind it! Play along the biggest hoax ever in #Bedurulanka2012 🌊
Here’s a peek into the world🌏
▶️https://t.co/CpL3CixoZR@ActorKartikeya @iamnehashetty #Clax @Benny_Muppaneni #ManiSharma @Loukyaoffl @SonyMusicSouth @Ticket_Factory @PulagamOfficial pic.twitter.com/V5nLrQJEWt
— Loukya entertainments (@Loukyaoffl) December 21, 2022
కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: