
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 54


సూర్య 42 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

#NKR 19 చివరి దశలో షూటింగ్

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్నా బ్లెస్సింగ్ కావాలి

20 ఏళ్ల నువ్వే నువ్వే లవ్లీ మూమెంట్

కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా

ఏజెంట్ లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్

సల్మాన్ కు చరణ్ సర్ ప్రైజింగ్ ప్లానింగ్

రాజమండ్రి లో రామ్ చరణ్

గాడ్ ఫాదర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

త్రివిక్రమ్ సినీ ప్రయాణానికి 20 ఏళ్లు

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ ప్రారంభం

హరిహర వీరమల్లు - వైరల్ గా పవన్ లేటెస్ట్ పిక్

#SSMB28 మూవీ అప్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ప్రాజెక్ట్ K బిగ్ బీ బర్త్ డే పోస్టర్
ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ ఆశ్విన్.

సూర్య 42 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం మంచి హిట్లతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ఫస్ట్ షెడ్యూల్…

#NKR 19 చివరి దశలో షూటింగ్
ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ రోల్ లో అలరించాడు. ఈసినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉండగా వాటిలో ఒకటి రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా అంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇది19వ చిత్రం.

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్నా బ్లెస్సింగ్ కావాలి
ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అంత ఈజీ కాదు. కానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి వరుస ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన కృతికి వరుస ఆఫర్లు వచ్చాయి. ‘ఉప్పెన’ తర్వాత కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత…

దర్శకుడు రాజమౌళి కి ఎన్టీఆర్ , సాయి తేజ్ , అజయ్ దేవగన్ బర్త్ డే విషెస్
బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజమౌళి రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో 12 బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రాంతీయ భాషా చిత్రం గా ఉన్న తెలుగు సినిమా ను బ్లాక్ బస్టర్ బాహుబలి , బాహుబలి 2 మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గుర్తింపు తెచ్చారు. టాలీవుడ్‌లో అపజయమే లేని దర్శకుడు రెండు 1000 కోట్ల సినిమాలు తెరకెక్కించి రికార్డ్ క్రియేట్ చేశారు. హీరోల ఇమేజ్, ఆధునిక సాంకేతికత జోడిస్తూ వెండితెరపై విజువల్ వండర్స్ ను రాజమౌళి క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు మూవీ రీ రిలీజ్
శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రవితేజ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమార్కుడు మూవీ ఘనవిజయం సాధించింది. DCP విక్రమ్ సింగ్ రాథోడ్ సీరియస్ పాత్రలో , అత్తిలి సత్తిబాబు గా కామెడీ పాత్ర లో రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి.

ఓరి దేవుడా గుండెల్లోనా మెలొడీ సాంగ్ రిలీజ్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. రీసెంట్ గానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో వయసు పెరుగుతున్నా పెళ్లి కానీ వ్యక్తి పాత్రలో సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈసినిమాకు కూడా దర్శకత్వంలో వహించాడు.

20 ఏళ్ల నువ్వే నువ్వే లవ్లీ మూమెంట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు. మొదట రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను పనిచేశారు. ఆ తరువాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి నిన్నటితో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈసినిమా విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పెషల్ షో వేశారు. అంతేకాదు చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు తరుణ్-శ్రియ లతో పాటు త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్, ప్రకాష్ రాజ్ తో సినిమాలో నటించిన కీలక నటీనటులందరూ…

కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

20 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతున్న ధమాకా ఫస్ట్ సింగిల్ జింతాక్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా తెరకెక్కిన విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను…

11 రోజులలో 400 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్ 1
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత. ఇక మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసేసి ఆతరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు హోస్ట్ గా అలానే బిజినెస్ రంగంలో కూడా సామ్ అడుగుపెట్టి ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు వేయడంలో సామ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల సామ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చైతుతో విడిపోయిన తరువాత దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు…

ఏజెంట్ లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్
అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్. కానీ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అఖిల్ కు పరాజయాలనే అందించింది. అయితే ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సల్మాన్ కు చరణ్ సర్ ప్రైజింగ్ ప్లానింగ్
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. పేరుకే రీమేక్ కానీ మోహన్ రాజా మాత్రం స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇదే ఈసినిమా సక్సెస్ కు ప్రధాన కారణమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈసినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తాాజాగా ఈసినిమాను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గాడ్ ఫాదర్ పై ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతం, చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ రజనీ కాంత్ చెప్పినట్టు…

రాజమండ్రి లో రామ్ చరణ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.ఈ మూవీ లో 1200 ఫైటర్స్ తో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , రామ్ చరణ్ , కియారా అద్వానీ లతో పాటు 1000 మంది జూనియర్…

గాడ్ ఫాదర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

త్రివిక్రమ్ సినీ ప్రయాణానికి 20 ఏళ్లు
పంచులు ప్రాసలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తన సినిమాల్లో పంచులు ఎలా ఉంటాయో.. అలానే తన సినిమాల్లో డైలాగులు జీవితానికి దగ్గరగా ఉండే విధంగా.. మనసును తాకే విధంగా ఉంటాయి. అందుకే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు తను చేసే సినిమాల్లో చాలా వరకూ కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయి. ఆ లిస్ట్ లో త్రివిక్రమ్ సినిమాలు చాలా ఉంటాయి. నువ్వే నువ్వే సినిమాతో మొదలుపెడితే మల్లీశ్వరి, అతడు, జల్సా, ఖలేజా చివరిగా వచ్చిన అల వైకుంఠపురం వరకూ ఏ సినిమా కూడా ఒక్కసారికే బోర్ కొట్టే సినిమాలు ఏం లేవు…

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త విభిన్నమైన పాత్రలే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ పాత్రలైనా, క్లాస్ పాత్రలైనా సరే తను చేయగలడని నిరూపించాడు. అందుకనే వరుణ్ తేజ్ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మంక ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై తన ఫోకస్ పెడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. లండన్…

హరిహర వీరమల్లు - వైరల్ గా పవన్ లేటెస్ట్ పిక్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు... మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావడమే. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ ఇంతవరకూ పూర్తి కాలేదు. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసినా ఒక షెడ్యూల్ ను మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది.