త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు. మొదట రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను పనిచేశారు. ఆ తరువాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి నిన్నటితో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈసినిమా విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పెషల్ షో వేశారు. అంతేకాదు చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు తరుణ్-శ్రియ లతో పాటు త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్, ప్రకాష్ రాజ్ తో సినిమాలో నటించిన కీలక నటీనటులందరూ హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. త్రివిక్రమ్, రవికిశోర్ గారు నా కోసం ఢిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం అని చెప్పారు. అయితే శ్రియ మాట్లాడుతున్న టైంలో శ్రియలో పెద్దగా మార్పు ఏం రాలేదు. కాకపోతే ఆమెకి పెళ్లయిపోయింది, కూతురు కూడా ఉందని తరుణ్ అనడంతో.. నవ్వేసిన శ్రియ.. తరుణ్‌ని స్టేజీపై అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేసింది. ఈ క్యూట్ మూమెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
View this post on Instagram
కాగా ఈసినిమాలో తరుణ్, శ్రియ హీరో హీరోయన్లుగా నటించారు. ఇంకా ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: