సల్మాన్ కు చరణ్ సర్ ప్రైజింగ్ ప్లానింగ్

Ram Charan To Surprise Salman Khan Soon,Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather, Godfather Collections, Godfather Latest Collections, Godfather Latest Update, Godfather Movie, Godfather Movie Collections, Godfather Movie Latest Collections, Godfather Movie Latest News And Updates, Godfather Movie Updates, Godfather New Update, Godfather Telugu Movie, GodFather Telugu Movie Latest News, GodFather Telugu Movie Live Updates, Godfather Telugu Movie New Update, Mega Star Chiranjeevi, Mohan Raja, Nayanthara, Salman Khan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. పేరుకే రీమేక్ కానీ మోహన్ రాజా మాత్రం స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇదే ఈసినిమా సక్సెస్ కు ప్రధాన కారణమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈసినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తాాజాగా ఈసినిమాను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గాడ్ ఫాదర్ పై ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతం, చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ రజనీ కాంత్ చెప్పినట్టు మోహన్ రాజా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ కు చరణ్ సర్ ప్రైజింగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే… ఈసినిమాలో సల్మాన్ ఖాన్ నటించినా కూడా రెమ్యూనరేషన్ ఏం తీసుకోలేదని చిరు ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఈనేపథ్యంలోనే చరణ్ సల్మాన్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి చరణ్ నుండి సల్మాన్ కు ఎలాంటి గిఫ్ట్ వెళుతుందో..

కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =