త్రివిక్రమ్ సినీ ప్రయాణానికి 20 ఏళ్లు

trivikram srinivas completes 20 successful years in tfi, 20 successful years in tfi, telugu film industry, Telugu cinema, Tollywood, trivikram srinivas, Director trivikram srinivas, 20 years, trivikram srinivas Latest Movies, trivikram srinivas's Upcoming Movies, 20 Years Of Trivikram, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పంచులు ప్రాసలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తన సినిమాల్లో పంచులు ఎలా ఉంటాయో.. అలానే తన సినిమాల్లో డైలాగులు జీవితానికి దగ్గరగా ఉండే విధంగా.. మనసును తాకే విధంగా ఉంటాయి. అందుకే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు తను చేసే సినిమాల్లో చాలా వరకూ కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయి. ఆ లిస్ట్ లో త్రివిక్రమ్ సినిమాలు చాలా ఉంటాయి. నువ్వే నువ్వే సినిమాతో మొదలుపెడితే మల్లీశ్వరి, అతడు, జల్సా, ఖలేజా చివరిగా వచ్చిన అల వైకుంఠపురం వరకూ ఏ సినిమా కూడా ఒక్కసారికే బోర్ కొట్టే సినిమాలు ఏం లేవు. అన్నీ సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూస్తాము.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయి 20 ఏళ్లు పూర్తయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన సినిమా నువ్వే నువ్వే. ఈసినిమా 2002లో విడుదలై మంచి హిట్ ను సొంతం చేసుకుంది. తల్లి కూతురు మధ్య ప్రేమ, ఇక తండ్రి లాంటి ప్రేమను అందించే అబ్బాయి ప్రేమలో అమ్మాయి పడటం.. ఆ క్రమంలో కాస్త తండ్రిని పట్టించుకోకపోవడం.. దాంతో తండ్రి-కూతురు మధ్య ప్రేమ.. ఇలా చాలా భావోద్వేగాల నడుమ ఈసినిమా నడుస్తుంది. అలానే కామెడీ కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా ఈసినిమా వచ్చినా చూస్తుంటారు.

ఇక ఈసినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా ‘నువ్వే నువ్వే’ నిలిచింది. వెండి నందిని ‘స్రవంతి’ రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు.

కాగా ఈసినిమాలో ఈ సినిమాలో తరుణ్, శ్రియ హీరో హీరోయన్లుగా నటించారు. ఇంకా ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.