మలయాళంలో ఎంట్రీ ఇస్తున్నా బ్లెస్సింగ్ కావాలి

Krithi Shetty Enters Mollywood With Her Next Film, Actress Krithi Shetty Enters Mollywood With Her Next Film, Krithi Shetty Next Film, Actress Krithi Shetty, Krithi Shetty Mollywood Debut, Uppena, Shyam Singha Roy, Bangarraju, Krithi Shetty Latest Movie, Krithi Shetty's Upcoming Movie, Mollywood, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అంత ఈజీ కాదు. కానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి వరుస ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన కృతికి వరుస ఆఫర్లు వచ్చాయి. ‘ఉప్పెన’ తర్వాత కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత కృతి శెట్టి ‘ది వారియర్’, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి చిత్రాలతో వరుస ఫ్లాప్‌లను సొంతం చేసుకుంది. అయినా కూడా తన అవకాశాలను మాత్రం తాను సొంతం చేసుకుంటూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు తెలుగులో సందడి చేసిన కృతిశెట్టి ఇప్పుడు మలయాళంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈవిషయాన్ని కృతిశెట్టి స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మలయాళంలో ఎంట్రీ ఇస్తున్నానని.. అందుకు మీ బ్లెస్సింగ్ కావాలి అంటూ పోస్ట్ లో పేర్కొంది. మలయాళ యంగ్ స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా వస్తున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి “అజయంతే రండంమోషణం” అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాకు జోమోన్ టి జాన్ సినిమాటోగ్రాఫర్ గా మరియు దీనిని యూజీఏం ప్లస్ మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. మరి చూద్దాం మలయాళంలో కృతిశెట్టికి ఎలాంటి లక్ వస్తుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =