ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ ఆశ్విన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. బిగ్ బి పిడికిలి బిగించి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేయగా.. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సడెన్ సర్ ప్రైజ్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























