
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 183


నువ్వు గర్వ పడేలా చేస్తా నాన్న..!

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్

కృతి శెట్టి హోలీ స్పెషల్ ఫొటో

ఉక్రెయిన్ బాడీగార్డ్ కు చరణ్ సాయం..!

దుబాయ్ లో నాగార్జున క్రేజ్

ట్రెండీ వేర్ లో తమన్నా హోలీ ట్రీట్

'రాధేశ్యామ్' మూవీ బెస్ట్ ఎపిసోడ్స్..!

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "

చరణ్ తో సినిమా చేయడం నా డ్రీమ్..!

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు

శ్రీవారి సన్నిధి లో "#NBK107 "మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

నువ్వు గర్వ పడేలా చేస్తా నాన్న..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మహేష్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోతుండటంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తి దశకు వచ్చేసింది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మరోపక్క స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి వరుసగా పాటలు రీలిజ్ చేస్తున్నారు. ఇప్పటికే కళావతి పాటను రిలీజ్ చేయగా సెకండ్ సాంగ్ ను 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ పాటకు సంబంధించి ప్రోమోను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ "కార్తికేయ 2 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కార్తికేయ 2 "మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు."కార్తికేయ 2 "మూవీతో పాటు నిఖిల్ , అనుపమ "18 పేజెస్ "మూవీ లో జంటగా నటించారు.

క్రికెటర్ 'సుందర్ వాషింగ్టన్' కు 'సుందరం' బెస్ట్ విషెస్..!
దాదాపు రెండేళ్ల తరువాత ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాడు నాని. ఈసినిమాతో సాలిడ్ హిట్ ను కూడా అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే తన కొత్త సినిమా అంటే సుందరానికిి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈసినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

'సర్కారు వారి పాట' పెన్నీ సాంగ్ ప్రోమో రిలీజ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తికరంగా చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఈయన నుంచి మరో సినిమా రాలేదు. దీంతో వెండి తెరపై మహేష్బాబు కనిపించి రెండేళ్ళు దాటింది. అందుకే అభిమానులు మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

కృతి శెట్టి హోలీ స్పెషల్ ఫొటో
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి…

అఫీషియల్.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'అజిత్ 62' మూవీ
తమిళ్ స్టార్ హీరో అజిత్ జోరు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. రీసెంట్ గానే వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. వెంటనే తన 61వ సినిమాను కూడా స్టార్ట్ చేసేశాడు. అది కూడా వలిమై డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో రాబోయే ఈ సినిమాను కూడా బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

"శ్రీ శ్రీ శ్రీ రాజావారు "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
రంగాపురం రాఘవేంద్ర , మురళీకృష్ణ చింతలపాటి సమర్పణ లో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై "శతమానం భవతి"మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "శ్రీ శ్రీ శ్రీ రాజావారు "మూవీ తెరకెక్కుతుంది. మలయాళ మ్యూజిక్ కంపోజర్ కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.నార్నే శ్రీనివాసరావు తనయుడు , ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తమ్ముడైన నితిన్ హీరోగా లాంచ్ అవడానికి తగిన శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో "ఆర్ ఆర్ ఆర్" దుబాయ్ ఈవెంట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్' మాసివ్ ప్రమోషన్స్.. 9 నగరాల షెడ్యూల్ ఫిక్స్..!
ఆర్ఆర్ఆర్ సందడి మళ్లీ మొదలైంది. వాయిదా పడిన తరువాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. 9 ప్రధాన నగరాల్లో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఏ నగరంలో ఎప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారో ఆ డేట్లను కూడా ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఉక్రెయిన్ బాడీగార్డ్ కు చరణ్ సాయం..!
కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఇండస్ట్రీలో ఎవరి ఏదైనా సమస్యలు వచ్చినా, ఫ్యాన్స్ కు కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు వరదలు, తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు ఇలా చాలా సమయాల్లో సాయం చేయడానికి ముందుకు వస్తూ తమ సాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన సాయం గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చేసింది ఇక్కడ వాళ్లకు కాదు. ఉక్రెయిన్ లోని ఓ వ్యక్తికి.

విశ్వక్ సేన్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మిథిల పాల్కర్
పివిపి సినిమా బ్యానర్ పై అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిల పల్కర్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్"ఓరి దేవుడా... !" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ "ఓ మై కడవులే"మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి పెరల్ వి పొట్లూరి , పరమ్ వి పొట్లూరి , దిల్ రాజు నిర్మాతలు. "ఓరి దేవుడా.. !"మూవీ కి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

దుబాయ్ లో నాగార్జున క్రేజ్
రీసెంట్ గా సూపర్ హిట్ "బంగార్రాజు "మూవీ తో ప్రేక్షకులను అలరించిన కింగ్ నాగార్జున , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ది ఘోస్ట్ "మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతుంది. అక్కడ నాగార్జున , సోనాల్ చోహన్ లపై పలు సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను , నాగార్జున పై యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఆయా లొకేషన్స్ వర్కింగ్ స్టిల్స్ ను దర్శకుడు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

ట్రెండీ వేర్ లో తమన్నా హోలీ ట్రీట్
“శ్రీ ” మూవీ తో మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ కు పరిచయం అయ్యి తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

అభిమానులు , ప్రేక్షకులకు మహేష్ బాబు హోలీ శుభాకాంక్షలు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కళావతి కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

'రాధేశ్యామ్' మూవీ బెస్ట్ ఎపిసోడ్స్..!
ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాధేశ్యామ్’. 1970నాటి యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే నటించి మెప్పించారు. మార్చి 11వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక రాధేశ్యామ్ ఓ విజువల్ వండర్ అని ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ కు తెలిసే ఉంటుంది. ఇలాంటి సినిమాల గురించి చెప్పడం కంటే స్క్రీన్ పై చూస్తేనే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. అందమైన ప్రేమకథ, దానికి చక్కని నటీనటులు, వారి నటన, అంతే అందంగా ఉండే…

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

హ్యాపీ బర్త్ డే అప్పూ సార్... యష్ ఎమోషనల్ పోస్ట్..!
ఇక నేడు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా తను చివరిగా నటించిన జేమ్స్ సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులందరూ ఈసినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో యష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

చరణ్ తో సినిమా చేయడం నా డ్రీమ్..!
గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్న వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. గౌతమ్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని.. చరణ్ కు కూడా కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడన్న కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో గౌతమ్ ఖండించాడు కూడా. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి వీరిద్దరి సినిమా రావడం దాదాపు ఖరారే కానీ అధికారిక ప్రకటన రావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తన్నారు. అసలు సంగతేంటంటే తాజాగా ఒక నెటిజన్ దీనిపై సోషల్ మీడియా వేదికగా గౌతమ్ తిన్ననూరిని అన్నా చరణ్ అన్నతో మంచి సినిమా తీయన్నా.. క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి అంటూ కామెంట్ పెట్టగా దానికి గౌతమ్ తన బెస్ట్ వర్క్ ని ఈ సినిమాకి అందిస్తానని…

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ , అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ , కమల్ హాసన్, కార్తీ వంటి హీరోలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.తమిళ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కావడం , సక్సెస్ రేటు, నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారు.