‘రాధేశ్యామ్’ మూవీ బెస్ట్ ఎపిసోడ్స్..!

Prabhas Radhe Shyam Movie Best Episodes,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Latest News,Radhe Shyam Box Office Collections,Radhe Shyam Box Office Records, Prabhas and Pooja Hegde starrer Radhe Shyam,Elegant love story of Vikramaditya and Prerana,Director Radha Krishna,Radhe Shyam visual wonder for Audiance, best episodes of Radhe Shyam Movie,Rashe Shyam Train Episode Hero & Heroine At First Sight,360 degree shot in Tran Episode,Thaman’s background score Mjusic highlight for Radhe Shyam Movie, Boat Episode in Radhe Shyam Movie,Vikramaditya and Prerana both sailing together in a boat in a beautiful lake,Ship Episode In Radhe Shyam Movie, ship episode of Radhe Shyam is the best visual experience,Credit goes to the director Radha Krishna for dreaming of such great visual effects, All other technical departments including the cinematography,action,art and visual effects are all exceptional For Radhe Shyam Movie, Prabhas is the most handsome guy with great looks Says Radha krishna,Radha Krishna i cloud not get better cut out than Prabhas for Radhe Shyam Movie, Prabhas Radhe Shyam World wide Movie,Prabhas Latest Movie,Krishnam Raju,UV Creations,Radha Krishna Kumar,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie, Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Pure classic romantic Movie,Radhe Shyam Movie about love and destiny,Krishnam Raju played the role of Pramahamsa

ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాధేశ్యామ్‌’. 1970నాటి యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్‌ ప్రేరణగా పూజా హెగ్డే నటించి మెప్పించారు. మార్చి 11వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక రాధేశ్యామ్ ఓ విజువల్ వండర్ అని ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ కు తెలిసే ఉంటుంది. ఇలాంటి సినిమాల గురించి చెప్పడం కంటే స్క్రీన్ పై చూస్తేనే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. అందమైన ప్రేమకథ, దానికి చక్కని నటీనటులు, వారి నటన, అంతే అందంగా ఉండే లొకేషన్స్, ఆఫీల్ తెలిసేలా ఉండే సంగీతం ఇలా అన్నీ కలగలిసిన ప్రేమకావ్యమే ఈ రాధేశ్యామ్ అని మాత్రం చెప్పొచ్చు. మొదటి నుండి ఇక సినిమా మొదటి నుంచి విజువల్ వండర్ గానే హైలైట్ అయిన సంగతి తెలిసిందే. టీజర్..ట్రైలర్..ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలా ప్రతీది సినిమాకి సంబంధించి సినిమాలో క్లాస్ విజువల్ అంశాన్నే హైలైట్ చేసింది. ఇక విజువల్స్ తో పాటు కొన్ని గుర్తుండే పోయే బెస్ట్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైన్ ఎపిసోడ్

మొదటిగా చెప్పుకోవాల్సింది ట్రైన్ ఎపిసోడ్ గురించి.. ప్రేరణను చూసిన మొదటి చూపులోనే విక్రమాదిత్య ప్రేమలో పడతాడు. ఇక ఈ సీన్ ను కూడా చాలా బాగా చిత్రీకరించాడు రాధాకృష్ణ. ప్రేరణ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ప్రకృతిని, ఆగాలిని ఆస్వాదిస్తుండగా.. విక్రమాదిత్య కూడా తన ఎదురుగా వచ్చి నిలబడి తన మొహాన్ని చూస్తూ ఉంటాడు. ఇక ఆ అందమైన షాట్ కు సినిమాటోగ్రఫి అందించిన విజువల్స్ మాత్రం సూపర్. ఈ సీన్ ను 360 డిగ్రీ షాట్ లో తీయడంతో ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.

బోట్ ఎపిసోడ్

ఇక ఈసినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బోట్ ఎపిసోడ్ గురించి. ఈ సన్నివేశం కూడా విక్రమాధిత్య-ప్రేరణకు మధ్య వచ్చే మరో రొమాంటిక్ సన్నివేశం. ఈ సీన్ లో విక్రమాధిత్య-ప్రేరణ ఓ బోట్ లో వెళుతుంటారు. ఇక ఈసీన్ లో విక్రమాదిత్య ప్రేరణ చేయి చూసి తన లవ్ స్టోరీ గురించి చెబుతాడు. తన లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని చెబుతాడు. అదే టైం లో హీరోయిన్ కు ఉన్న హెల్త్ ఇష్యూ చెప్పబడుతుంది. ఈసీన్ కూడా డైరెక్టర్ చాలాా బాగా చూపించాడు. ఆ కాన్ఫ్లిక్ట్, ఆ తరువాత వచ్చే ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్, విజువల్స్ అన్నీ కలవడంతో ఈ ఎపిసోడ్ కూడా బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

షిప్ ఎపిసోడ్
మొదటి నుండి షిప్ ఎపిసోడ్ ఈసినిమాలో హైలెట్ గా ఉంటుందని చెబుతూనే ఉన్నారు మేకర్స్. ఇక చెప్పినట్టే ఉంది ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఉంది ఈ ఎపిసోడ్. షిప్ ఎపిసోడ్ ఈ సినిమాలోనే బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కు ఇస్తుంది. . తన ప్రేమను గెలిపించుకోవడం కోసం విక్రమాదిత్య నేచర్ తో సైతం ఎదురించి పోరాటం చేయడమే థీమ్ గా ఈ సీన్ ను డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. ఇలాంటి సీన్ రాసుకున్నందుకు దాన్ని అంతే గ్రాండియర్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న రాధాకృష్ణ కు మాత్రం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక ప్రభాస్ కు కూడా క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. డైరెక్టర్ చెప్పినట్టే చేసే హీరో లేకపోతే అవుట్ పుట్ అనుకున్నంత రాదు. కానీ డైరెక్టర్ ఏం అనుకున్నాడో అది ప్రభాస్ ఇవ్వగలిగాడు కాబట్టే ఆ ఎపిసోడ్ అంత బాగా వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + seventeen =