రీసెంట్ గా సూపర్ హిట్ “బంగార్రాజు “మూవీ తో ప్రేక్షకులను అలరించిన కింగ్ నాగార్జున , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్ “మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతుంది. అక్కడ నాగార్జున , సోనాల్ చోహన్ లపై పలు సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను , నాగార్జున పై యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఆయా లొకేషన్స్ వర్కింగ్ స్టిల్స్ ను దర్శకుడు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
60+ఏజ్ లో కూడా నాగార్జున యంగ్ హీరో వలే కనిపిస్తూ ఎనర్జిటిక్ గా ఉండడం విశేషం. దుబాయ్ లో ఉన్న నాగార్జున ను అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీ లు తీసుకొనడం , కారు లో వెళ్ళిపోయినా వెంటపడడం నాగార్జున కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: