విజయ్ సేతుపతి, నిహారిక ప్రధాన పాత్రల్లో ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. నిహారిక పెళ్లికి ముందే నటించిన సినిమా అయినప్పటికీ తెలుగులో ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నిహారిక ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు.కాగా ఇంకా ఈసినిమాలో గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, వీజీ చంద్రశేఖర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ శరవణన్ సినిమాటోగ్రఫీ అందించాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: