‘బాహుబలి’ని తలపిస్తున్నయష్ ‘గజకేసరి’

Rocking Star Yash Gajakesari Movie Resembling Bahubali In Grandeur and Stunning Visuals,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Yash Gajakesari Telugu Movie Trailer,Yash as Bahubali,Amulya,Latest Telugu Movie Trailers 2021,Yash Gajakesari Movie Trailer,Yash As Bahubali,Yash Gajakesari Telugu Movie Trailer,Yash Gajakesari Telugu Movie,Yash Gajakesari,Yash Gaja Kesari Telugu Movie Trailer,Yash Gaja Kesari,Gajakesari,Gajakesari Movie,Yash Gajakesari Trailer Review,Gaja Kesari Telugu Movie,Bahubali,Gajakesari Movie Trailer Telugu,Gajakesari Movie Trailer,Gajakesari Trailer,Yash Telugu Movies,Yash Gajakesari Release In Theaters On March 5th,Yash Gajakesari On March 5th,Yash Gajakesari Telugu Movie Trailer Review

ఒకప్పుడు కన్నడ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. అయితే కె.జి.యఫ్ పుణ్యమా అని అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకుందామనుకుంటున్నారు కన్నడ దర్శక నిర్మాతలు. నిజానికి కె.జి.యఫ్ తప్పా ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అంతగా ఆడిన దాఖలాలేవి లేవు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కె.జి.యఫ్ తో తెలుగు ప్రేక్ష‌కులకు బాగా దగ్గరైన యష్ కూడా ఇప్పుడు అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన సినిమాలను డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2014 లో వచ్చిన గజకేసరి సినిమాను ఇప్పుడు ఇన్నేళ్లకు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. యష్ అమూల్య‌, సాధు కోకిల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం ‘గ‌జ‌కేస‌రి’. కన్నడ చారిత్రక యాక్షన్‌ చిత్ర నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను ఎస్ కృష్ణ దర్శకత్వం వహించగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ అయితే బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను అంటూ యష్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ.. ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’ అన్న డైలాగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ టీజర్ లో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే యష్ లుక్ కొన్ని చోట్లు బాహుబలిని తలపిస్తుంది. అంతేకాదు.. ఎనుగు మీదకు ఎక్కడంలాంటి సన్నివేశాలు కూడా బహుబలి సినిమాను గుర్తుచేస్తున్నాయి. మరి 2014 అంటే బాహుబలి కంటే ముందే వచ్చింది.. ఆప్పుడే యష్ ఇలాంటి ఫీట్లు చేశాడన్నమాట.

ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో యష్ రెండు పాత్రల్లో కనిపించటం విశేషం. అమూల్య, అనంత్ నాగ్, సాధుకోకిల, గిరిజా లోకేశ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం వి. హరికృష్ణ అందించారు. శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈసినిమాను మార్చి 5న తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =