వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ ను వెండితెరపై చూసే అవకాశం రాకపోవడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పడు వకీల్ సాబ్ రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు తమ హీరోని స్క్రీన్ పై చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఈ చిత్రం 9 ఏప్రిల్ 2021 న తెరపైకి వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్.
తాజాగా క్రిష్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. 2022సంక్రాంతికి రానుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలవనుండడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
The most awaited film of Power Star @PawanKalyan garu & our @DirKrish, #PSPK27 will be coming on Sankranthi 2022. 🥳🤩
Get ready to witness the Periodic Extravaganza and Might Power Fire like never before on Big Screens 🔥 #PSPK27onSankranthi2022 #AMRatnam @mmkeeravaani pic.twitter.com/H7WfelUB2u
— Mega Surya Production (@MegaSuryaProd) February 28, 2021
కాగా పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృందం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: