
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 8


హెబ్బా పటేల్ న్యూ లుక్

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటో

ఆది 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి

నెలన్నర గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు రిలీజ్

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ

సోదరుడి మృతిపై 'కిరణ్ అబ్బవరం' ఎమోషనల్ పోస్ట్

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్

దృశ్యం 3.. క్లైమాక్స్ మాత్రమే రెడీగా ఉంది

మరో విషాదం 'కిరణ్ అబ్బవరం' సోదరుడు మృతి

రానా '1945' రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి నుండి విభిన్నమైన సినిమాలను చేయడంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం తన ఖాతాలో పలు సినిమాలు ఉండగా.. అందులో 1945 సినిమా కూడా ఒకటి. శివకుమార్ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో పలు వివాదాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక అన్ని అడ్డంకులు తొలగించుకొని ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 31న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ లో సర్కారు వారి పాట, వకీల్ సాబ్
ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి సినిమాలకు వ్యూస్ పరంగా రికార్డులు అంటూ లెక్కలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీనే. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ, ట్విట్టర్ లో ట్వీట్ లు, ట్యాగ్ లు ఇలా ప్రతి విషయంలోనూ రికార్డులే. ఇక ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు తమ హీరోల రికార్డ్ లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటారు.

హెబ్బా పటేల్ న్యూ లుక్
“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఘోస్ట్ " మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా “యశోద “మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిదనీ , థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదనీ చెప్పారు.

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?
సూపర్ హిట్ "చిన్న తంబి "తమిళ మూవీ హిందీ రీమేక్ "అనారీ" (1993)మూవీ తో హీరో వెంకటేష్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత వెంకటేష్ హీరోగా సూపర్ హిట్ "యమలీల"తెలుగు మూవీ హిందీ రీమేక్ "తక్ దీర్ వాలా "తెరకెక్కింది. ఆ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత హీరో వెంకటేష్ మరే హిందీ మూవీ లోనూ నటించలేదు. 25సంవత్సరాల తరువాత వెంకటేష్ ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటో
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై "మత్తు వదలరా"మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కనున్న కామెడీ ఎంటర్ టైనర్ ప్రారంభం అయ్యింది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'థాంక్యూ' ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్.. థియేటర్లలోనే రిలీజ్..!
మజిలీ, లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమా అలానే థాంక్యూ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిలో బంగార్రాజు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. థాంక్యూ సినిమా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనితో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గత కొద్దికాలంగా…

ఆది 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి
ఆది సాయికుమార్ ఇప్పుడు ఫుల్ జోరు పెంచిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు లిస్ట్ లో ఉండగా వాటితో పాటు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తున్న సంగతి విదితమే. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లగా తాజాగా షూటింగ్ పూర్తి…

నెలన్నర గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు రిలీజ్
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ 2022 మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. నెలన్నర గ్యాప్ లో హీరో రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వార్ అండ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు.ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి మృణాళి ఠాకూర్ కథానాయిక. ఈ మూవీ కి "లెఫ్టినెంట్ రామ్" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "రాకెట్ బాయ్స్" హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ
"రొమాంటిక్ "మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

సోదరుడి మృతిపై 'కిరణ్ అబ్బవరం' ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల జరిగిన రోడ్టు ప్రమాదంలో కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి కన్ను ముశారు. దీంతో వారి కుటుంబం విషాదంలో ఉండగా అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తన సోదరుడి మృతికి కిరణ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశాడు. అందులో రేయ్.. కిరా.. మన ఊరికి రోడ్డు సరిగా లేదు.. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా సాధించాలిరా అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. నన్ను హీరోగా చూడటం కోసం తన లగ్జరీ ని సైతం పక్కకుపెట్టాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనే టైమ్ కి తనే లేకుండా వెళ్లిపోయాడు. నన్నెప్పుడు…

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిజానికి కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే. దీంతో ఈసినిమాకు మంచి టాక్ రావడంతో అటు చిత్రయూనిట్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు హీరోలు కూడా అఖండ పై తమ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రశంసిస్తున్నారు.

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్
ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా “మడ్డీ “మూవీ తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై రోడ్ రేసింగ్ లో అనుభవం ఉన్న ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “మడ్డీ ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు. తెలుగు భాషలో “మడ్డీ “మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ద్వారా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు.

దృశ్యం 3.. క్లైమాక్స్ మాత్రమే రెడీగా ఉంది
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబర్ 19న విడుదలై అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇటీవలే ఈసినిమా సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా కూడా తీయగా అది కూడా హిట్ అయింది.

మరో విషాదం 'కిరణ్ అబ్బవరం' సోదరుడు మృతి
కరోనా టైమ్ లో ఎలాగైతే చాలా మంది సెలబ్రిటీలు కన్ను మూసి విషాదాన్ని మిగిల్చారో ఇప్పుడు మరోసారి అలాంటి విషాద ఛాయలే అలుముకుంటున్నాయి. గత రెండు మూడురోజులుగా పలు విషాద సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. రెండు మూడు రోజుల క్రితమే కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా నిన్న లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి తుది శ్వాస విడిచారు. ఇంకా ఈ విషాదాల నుంచి కోలుకోకముందే మరో హీరో ఇంట విషాదం నెలకొంది. ఆ హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం.