‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిజానికి కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే. దీంతో ఈసినిమాకు మంచి టాక్ రావడంతో అటు చిత్రయూనిట్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు హీరోలు కూడా అఖండ పై తమ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రశంసిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తమ ట్విట్టర్ ద్వారా అఖండ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.. నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఇక మహేష్ ట్వీట్ కు చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ థాంక్యూ మహేష్ అంటూ రిప్లై ఇచ్చింది.
Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation
— Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2021
ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా తన ట్విట్టర్ ద్వారా.. బాలకృష్ణ గారు గేట్స్ ఓపెన్ చేశారు.. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు.
Balakrishna gaaru opened the gates 🔥
Congratulations to the entire team of #Akhanda 🤗— Nani (@NameisNani) December 2, 2021
యంగ్ హీరో రామ్ పోతినేని స్పందిస్తూ, ఎక్కడ చూసినా అఖండ గురించే మాట్లాడుకుంటున్నారని.. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైందంటూ.. బాలకృష్ణ, బోయపాటి, చిత్రయూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశాడు.
Hearing great stuff about #Akhanda 🔥…Congratulations to Balakrishna garu..Boyapati Sreenu Garu, @dwarakacreation , @MusicThaman @ItsMePragya n the rest of the team!
Telugu Cinema Wave has begun! ❤️
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) December 2, 2021
నిఖిల్ కూడా అఖండ సినిమా గురించి ప్రశంసిస్తూ.. బాలకృష్ణ గారు, బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఎప్పుడూ మాసివ్ గానే ఉంటుంది.. ఈసినిమా ఇంకా బ్లాక్ బస్టర్అవ్వాలని కోరుకుంటున్నాను. థియేటర్లలోనే సినిమాను చూద్దాం.. పైరసీని ఎంకరేజ్ చేయోద్దు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Wishing #Akhanda becomes a Blockbuster…
Balayya Babu Sir & #BoyapatiSreenu garu Combination as always will be MASSIVE on the BIG SCREEN…
Requesting everyone Not to encourage Piracy and support Telugu Film Industry by watching the movie in Theatres 🙏🏽 pic.twitter.com/mbWpaECI3O— Nikhil Siddhartha (@actor_Nikhil) December 2, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: