
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 183


3 మంకీస్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
చిరు కి 'ఆచార్య' - ప్రభాస్ కి 'ఓ డియర్'
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ రిలీజ్

లాస్ ఏంజెల్స్ లో "మోసగాళ్ళు"

స్టార్ హీరోయిన్ సమంత రిటైర్ మెంట్ ?

2021 సంక్రాంతి పోరు - రాజమౌళి వర్సెస్ శంకర్..!

ఒకే బాటలో వెంకటేష్, రానా

`క్రిష్ 4`లో కత్రినా కైఫ్?

బాలీవుడ్ బ్యూటీతో రవితేజ?

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?
ద్విపాత్రాభినయంలో మహేష్..?

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!

సవారి మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

3 మంకీస్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
నాకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయండి..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్సే రాబట్టింది. తెలుగుతో పోల్చుకుంటే తమిళ్ లో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అయితే అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది.
చిరు కి 'ఆచార్య' - ప్రభాస్ కి 'ఓ డియర్'
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి 'గోవింద ఆచార్య' టైటిల్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. 'ఆచార్య' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. మాట్నీ ఎంటెర్టైన్మెంట్ వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో…
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ రిలీజ్
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లాస్ ఏంజెల్స్ లో "మోసగాళ్ళు"
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు హీరోగా జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ , హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ "మోసగాళ్ళు" తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత రిటైర్ మెంట్ ?
సక్సెస్ ఫుల్ మూవీ "ఏ మాయ చేసావె"తో టాలీవుడ్ లో సమంత ప్రవేశించారు. సమంత నటించిన తెలుగు మూవీస్ బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు, అత్తారింటికి దారేది , మనం, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, తమిళ మూవీస్ కత్తి, తెరి, 24, మెర్సల్, ఇరుంబు తిరై , యు టర్న్, సూపర్ డీలక్స్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

రాజమౌళి ఫస్ట్ పొంగల్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
యస్. యస్. రాజమౌళి.. అపజయమంటూ ఎరుగని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. `స్టూడెంట్ నంబర్ 1` నుంచి `బాహుబలి - ది కంక్లూజన్` వరకు జక్కన్న రూపొందించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

2021 సంక్రాంతి పోరు - రాజమౌళి వర్సెస్ శంకర్..!
ఈ ఏడాది సంక్రాంతి పోరు ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి మాత్రం తెలుగు పరిశ్రమకు బాగాగే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. 'దర్బార్' తో మొదలైన సందడి.. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా, 'అల వైకుంఠపురములో', ' ఎంత మంచి వాడవురా' సినిమాల వరకూ సాగింది. దర్బార్ తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోగా.. మహేష్, బన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కలెక్టన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఇక కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమా కూడా మంచి టాక్ ను సొంత చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

షారూఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది - వరుణ్ తేజ్
కంచె, ఫిదా, తొలిప్రేమ, F2, గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తాను బాక్సర్ గా నటించే స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి, ఇండియా లో ఉన్న మేజర్ చిత్ర పరిశ్రమల మూవీస్ లో నటించి తన మార్కెట్ ను విస్తరించాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నారు.

ఒకే బాటలో వెంకటేష్, రానా
ఈ వేసవి దగ్గుబాటి అభిమానులకు వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా.. తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. `నారప్ప`గా వెంకటేష్ సమ్మర్ లో సందడి చేయనుండగా.. `విరాట పర్వం`తో రానా అదే సీజన్ లో పలకరించనున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.

`క్రిష్ 4`లో కత్రినా కైఫ్?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `క్రిష్` సిరీస్ లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. `కోయ్ మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)... ఇలా ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత ఈ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తొలి మూడు భాగాల్లో కథానాయకుడిగా నటించిన హృతిక్ రోషన్ నే హీరోగా నటిస్తుండగా.. హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ సూపర్ హీరో సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

బాలీవుడ్ బ్యూటీతో రవితేజ?
ఇటీవలే `డిస్కో రాజా`గా ఎంటర్ టైన్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `క్రాక్`తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ స్టోరీ మే 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యేలోపే `రాక్షసుడు` దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు రవితేజ. ఇందులో మాస్ మహారాజా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీకట్టిన పవన్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు `కాటమ రాయుడు` (2017) కోసం జట్టుకట్టారు. కాగా, స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందట.
ద్విపాత్రాభినయంలో మహేష్..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని... రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన "బాహుబలి", " బాహుబలి 2" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ "RRR"షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!
ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జాను' టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ మారిన సంగతి తెలిసిందే. కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో అనుకున్న ముందుగా చెప్పిన డేట్ ను మర్చి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ ఏడాది 2020 జులై 30 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి మార్చారు. ఇక 'ఆర్ఆర్ఆర్' టీమ్ అలా డేట్ మార్చిందో లేదో అప్పుడే మరో సినిమా ఆ రిలీజ్ డేట్ ను బుక్ చేసుకుంది. ఆ సినిమా ఏదో కాదు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్2 సినిమా.
షూటింగ్ స్పాట్ లోనే విజయ్ కు ఐటీశాఖ షాక్..!
తమిళ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తన సినిమాల ద్వారానే కాకుండా.. ఈ మధ్య పలు విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సమయంలో ఐటీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి షాకిచ్చారు. అసలు సంగతేంటంటే.. విజయ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన 'బిగిల్' సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ సైతం సాదించింది. 'విజయ్ సినిమా అంటే ఆ మాత్రం కలక్షన్స్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు'. ఇక ఈ సినిమాను నిర్మించింది AGS ఎంటర్టైన్మెంట్స్.