ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే… దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ’96’ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘జాను’ టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే ‘జాన్’ అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమా చూసిన తర్వాత తనకి కూడా జాను అనే టైటిలే పెట్టాలని అనుకున్నాడట. ఈ నేపథ్యంలో… ఈ సినిమా టైటిల్ కోసం ప్రభాస్, వంశీ, ప్రమోద్ ను అడిగాడట దిల్ రాజు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు దిల్ రాజు. అందుకే తాను అడిగిన వెంటనే టైటిల్ ను ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెపుతున్నాడు.
[custom_ad]




కాగా శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. మరి తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. మరి తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: