చిరు కి ‘ఆచార్య’ – ప్రభాస్ కి ‘ఓ డియర్’

Acharya For Chiru and O Dear For Prabhas,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas,Acharya For Chiru,O Dear For Prabhas,Chiranjeevi,Chiranjeevi Latest News,Mega Star Chiranjeevi Upcoming Movie Title

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి ‘గోవింద ఆచార్య’ టైటిల్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ‘ఆచార్య’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. మాట్నీ ఎంటెర్టైన్మెంట్ వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో కలిసి రామ్ చరణ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే ‘జాన్’ అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టేసారు. తాను అడగడం వల్లే ప్ర‌భాస్‌, వంశీ, ప్ర‌మోద్‌ ఈ టైటిల్ ను ఇచ్చినట్టు ఇప్పటికే దిల్ రాజు 96 ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలిపాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మరో కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాకు ‘ఓ డియర్’ కానీ ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిలే సరిగ్గా సరిపోతుందని.. ఈ టైటిలే ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరి ఇవి వార్తలుగానే ఉంటాయా.. నిజంగానే ఇవే టైటిల్స్ ను ఉంచుతారా? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =